పట్టాల కోసం ప్రజావాణిలో నిరసన

21-09-2026 | 08:39pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఆసిఫాబాద్ మండలం(Asifabad Mandal) సమేలా(కాప్రి) గ్రామానికి చెందిన దుర్వ రాము బంధువులు సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాలులో బైఠాయించి నిరసన తెలిపారు. తమ భూములను కొందరు అన్యాక్రాంతం చేసి ప్లాట్లు చేసి విక్రయించారని ఆరోపించారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నినాదాలు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వారించారు. అనంతరం సీఐ నీలం రవి వారితో మాట్లాడి తహసీల్దార్‌తో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు ఆయనతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.

మరిన్ని వార్తలు