ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లిన సీజేపీ ప్రతినిధి బృందం

21-09-2026 | 08:43pm

అడ్డుకున్న పోలీసులు

హనుమకొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టెంబర్ 20న పైకప్పు పెచ్చులు ఊడిపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులపై పడటంతో వారు గాయపడిన ఘటన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party) ప్రతినిధి బృందం ఆసుపత్రిని సందర్శించింది. ఈ ఘటనలో అసలేం జరిగిందో తెలుసుకోవడంతో పాటు గాయపడిన రోగుల పరిస్థితి, ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలు, భవనాల భద్రత తదితర అంశాలను పరిశీలించేందుకు సిజెపి సౌత్ జోన్ ఇన్‌చార్జ్, నేషనల్ మీడియా హెడ్ విజయ్ మల్లంగి నేతృత్వంలో ఆస్పత్రి సందర్శనకు వెళ్లారు. 

సీజేపీ ప్రతినిధి బృందం ఆసుపత్రికి చేరుకున్న సమయంలో జిల్లా కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు. ఆసుపత్రిలో జరిగిన ఘటనపై కలెక్టర్లు ను కలిసి మాట్లాడేందుకు సి జె పి ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు పోలీసులు అనుమతించకుండా అడ్డుకున్నారు.

అనంతరం విజయ ముల్లంగి మాట్లాడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు మళ్లీ గాయాలపాలవడం ఆందోళనకరమని, ఇలాంటి చర్యలు పునరాలతో కాకుండా జాగ్రత్తపడాలన్నారు.ప్రభుత్వాలు కొత్త ఆసుపత్రుల ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలపై చూపుతున్న శ్రద్ధను ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, భవనాల భద్రత, రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంపై కూడా చూపాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  కొత్త ఆసుపత్రుల నిర్మాణం, ప్రారంభోత్సవాల గురించి మాట్లాడటంతో పాటు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని,

ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్య వ్యవస్థలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పూర్తి చేసి, అవసరమైన వైద్య సదుపాయాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయ్ మల్లంగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే, ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భవనాల భద్రతపై తక్షణమే సమగ్ర పరిశీలన జరిపించాలని, ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరారు.

నూతన ఆసుపత్రి భవనాన్ని ఈ ఏడాది చివరి లోగా ప్రారంభించక పోతే వరంగల్‌ లో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.సూపరింటెండెంట్‌ను కలిసేందుకు కూడా తమను అనుమతించకుండా అడ్డుకున్నారని  బృందం పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంపై వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రతినిధులను జిల్లా కలెక్టర్‌ను, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలవకుండా పోలీసులు అడ్డుకోవడంపై సిజెపి బృందం అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు