నూతన సీఐని కలిసిన 6వ వార్డు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్
08-09-2026 | 12:38pm
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 08 ( విజయక్రాంతి ) : భూపాలపల్లి నూతన సీఐ(CI)గా చెన్నూరి శ్రీనివాస్ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని క్రిష్ణకాలని, 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్ మంగళవారం నూతన సీఐ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకముగా కలిసి శాలువాతో సత్కరించి, మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు గోసిక అశోక్ పాల్గొన్నారు