అసెంబ్లీ ముందు ఘర్షణలు.. 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు

08-09-2026 | 09:33am

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద జరిగిన ఘర్షణల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను నెట్టడం, కాలర్లు పట్టుకోవడం, దూషించడం, బెదిరించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. మహిళా పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఫిర్యాదు అందింది. సీఐ బాలస్వామి ఫిర్యాదుతో బీఎన్‌ఎస్‌ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వీడియోలు, సీసీటీవీ, మీడియా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు