అఫ్గానిస్థాన్ సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ ఫిట్

08-09-2026 | 11:56am

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) ఫిట్‌నెస్ సాధించారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ రిపోర్ట్ రేపు రానున్నట్లు సమాచారం. రిపోర్ట్ ఆధారంగా అఫ్గాన్ సిరీస్‌లో బుమ్రాను ఆడించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ క్లియరెన్స్ కూడా పెండింగ్‌లో ఉంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వరుసగా ఆరు టీ20ల్లో ఓటములు ఎదుర్కొన్న అఫ్గానిస్థాన్‌కు ఈ సిరీస్ కీలకంగా మారింది.

మరిన్ని వార్తలు