గౌడ సంఘం నూతన సభ్యత్వాలకు రూ.20 వేల రుసుము

22-10-2026 | 09:53pm

గణపురం, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలోని గౌడ సంఘంలో(Gowda Association) నూతన సభ్యత్వాలు కల్పించేందుకు సంఘం పెద్దలు అంగీకరించారు. గణపురం సీఐ కరుణాకర్ రావు, ఎస్సై బి. అశోక్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన సభ్యత్వం పొందేందుకు రూ.20,000 రుసుము చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గౌడ సంఘం పెద్దమనుషులు మార్క మొగిలి గౌడ్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, గణపురం ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి భాస్కర్ రావు, బూర రాజగోపాల్ గౌడ్, గుర్రం తిరుపతి గౌడ్, మామిండ్ల కృష్ణస్వామి గౌడ్, మాదాసు రవి గౌడ్, మాదాసు అర్జున్ గౌడ్, ఆరెల్లి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు