వలలో చిక్కుకొని మృత్యువాత
22-10-2026 | 11:12pm
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) వెల్దండ మండలం బొల్లంపల్లి రెవెన్యూ శివారులో గల కొత్త చెరువు(Kotha Cheruvu lake)లో స్నానానికి వెళ్లిన గొర్రెల కాపరి మృత్యువాత పడ్డారు. మండల పరిధిలోని గానుగట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని కోనేటివాడ తండాకు చెందిన కేతావత్ గన్యా నాయక్ 56 గురువారం మధ్యాహ్నం గొర్రెలు కాస్తుండగా ఎండ వేడిమి తట్టుకోలేని అతను సమీపంలో గల కొత్తచెరువులో స్నానానికి వెళ్లి అందులో అప్పటికే చేపల వేట కోసం వేసి ఉన్న వలలో చిక్కుకొని మృతి చెందాడు సమీపంలో గల భార్య తన భర్త ఎంతకు రాకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి.. చూడగా అప్పటికే మృతి చెంది విగత జీవిగా కనిపించాడు.