బాలాలయంలో గణపతికి ఘనంగా వీడ్కోలు
23-09-2026 | 05:10pm
మహాదేవపూర్ /కాళేశ్వరం సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి(Sri Kaleshwara Mukteshwara Swamy) వారి ఆలయ బాలాలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణపతికి బుధవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య గణపతి విగ్రహాన్ని కదిలించి ప్రత్యేక పల్లకిపై ఉంచారు. అనంతరం భక్తులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తుల ఆధ్వర్యంలో గణపతి విగ్రహాన్ని గ్రామంలోని పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు గణపతి నామస్మరణ చేస్తూ స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం త్రివేణి సంగమం గోదావరి నది తీరంలో గణపతి విగ్రహానికి నిమజ్జనం నిర్వహించారు.