6 September, 2026 | 10:06 PM

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం

06-09-2026 | 09:03pm

గణపురం, సెప్టెంబర్ 06 ( విజయక్రాంతి): భూపాలపల్లి(Bhupalpally) జిల్లా ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గణపురం మేజర్ గ్రామపంచాయతీ(Major Gram Panchayat) సర్పంచ్ కట్కూరి రాధిక,శ్రీనివాస్ దంపతులను, ఆర్య వైశ్య మహాసభ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన సూర్యదేవర కార్తీక్, స్రవంతి దంపతులను ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిరూప అనిల్, జిల్లా అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్‌తో పాటు జిల్లా, రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు