6 September, 2026 | 10:04 PM

పేదలకి ఇందిరమ్మ ఇళ్లు వరం లాంటిది

06-09-2026 | 09:06pm

మేడ్చల్ అర్బన్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): పేదలకు ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) వరం లాంటిదని సైబరాబాద్ మున్సిపల్ మేడ్చల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి(Gundlapochampally) మున్సిపల్ 299వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్ జ్ఞానాపూర్‌లో లబ్ధిదారులు నీలూరి స్పందన రాణి, బాలస్వామికి మంజూరైన ఇందిరమ్మ గృహాన్ని ఇందిరమ్మ గ్రామ కమిటీ సమక్షంలో ఘనంగా ప్రారంభించడం జరిగిందని సురేందర్ ముదిరాజ్ స్పష్టం చేశారు.

పేద ప్రజల చిరకాల సొంతింటి కలను నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలోకి వెళుతుందని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఆత్మగౌరవంతో కూడిన పక్కా గృహాన్ని అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్, మాజీ సర్పంచ్‌లు బేరీ ఈశ్వర్, కోరని భగవాన్ దాస్, ఆలయ కమిటీ చైర్మన్ గడిల కృష్ణా రెడ్డి, పాలకుర్తి మురళి గౌడ్, మారేపల్లి సుధాకర్, పిలిప్స్, వినోద్ గౌడ్, చింతల భాస్కర్ ముదిరాజ్, రవీందర్ గౌడ్, జశ్వంతమ్మ, బాలస్వామి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు