6 September, 2026 | 10:36 PM

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వంటావార్పు

06-09-2026 | 09:21pm

బోధన్, సెప్టెంబర్ 06(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు బోధన్ మండలంలో పెగడపల్లి గ్రామంలోని బస్‌స్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆయేషా ఫాతిమా అమెర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు