శాశ్వత అన్న ప్రసాద వితరణ ప్రారంభం

08-09-2026 | 09:49pm

చెల్పూర్ శివాలయంలో శాశ్వత అన్న ప్రసాద వితరణ ప్రారంభం

మహత్తర సేవకు సరోజన,రమేష్ దంపతుల చేయూత

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని చెల్పూర్ లోని శ్రీ  సాంబమూర్తి స్వామివారి దేవాలయంలో భక్తుల కోసం శాశ్వత అన్నదాన కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతి నెల తొలి సోమవారం నిరంతరంగా అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించారు. ఈ సేవా కార్యక్రమాన్ని  రెంటాల సరోజన,రమేష్ దంపతులు స్వంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ కావటి రజిత రవీందర్ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.  భక్తులు,దాతలు, గ్రామస్థుల సహకారంతో ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

స్వంత ఖర్చులతో శాశ్వత అన్నదానానికి శ్రీకారం చుట్టిన సరోజన,రమేష్ దంపతుల సేవా దృక్పథాన్ని గ్రామస్థులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్  రామదాసు ప్రభాకర్, ఉపసర్పంచ్ పొన్నగంటి మలహర్రావు మాజీ సర్పంచ్  కొత్త పద్మ వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు బొందిల రమేష్ సింగ్, పొగాకుల గోపి, పొన్నగంటి మొగిలి, కల్లపురవి ఎడ్ల సుధాకర్, ఆలయ పురోహితులు  రఘు శర్మ, సాయి దీపక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు