తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెండ్

08-09-2026 | 06:17pm

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలని సస్పెండ్ చేస్తూ తెలంగాణ శాసన మండలి(Telangana Legislative Council) తీర్మానం చేసింది. మధు, నవీన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేయగా, వారి సస్పెండ్ తీర్మానాన్ని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) శాసన మండలిలో ప్రవేశ పెట్టారు. దీంతో తీర్మానంపై మూజువాణి పద్దతిలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutta Sukhender Reddy) ఓటింగ్ నిర్వహించారు. సెషన్ మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసినట్టు ఛైర్మన్ ప్రకటించారు. తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెండ్ తర్వాత మండలి వాయిదా పడింది. 


మరిన్ని వార్తలు