అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

08-09-2026 | 10:39pm

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గం(Nirmal Constituency)లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్టు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) తెలిపారు. ZPHS, నర్సాపూర్-G (తెలంగాణ పబ్లిక్ స్కూల్) అభివృద్ధికి సమగ్ర శిక్ష పథకం కింద రూ.12.50 కోట్లు నిధులు అయినట్టు తెలిపారు. ఈ నిధులతో త్వరలో పనులు చేపట్టి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు నాణ్యమైన విద్య అందించినట్టు తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అత్యధిక నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు