మున్సిపాలిటీ అభివృద్ధికి జనరల్ కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశం మంగళవారం పురపాలక కార్యాలయంలో నిర్వహించడం కౌన్సిల్ జరిగిoది. ఈ సమావేశానికి చైర్మన్ కొనతం వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2026-27 అభివృద్ధి పనులకు సంబంధించిన 17 తీర్మానాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆమోదించిన ప్రధాన తీర్మానాలు పట్టణంలోని 1 నుండి 15 వార్డులలో పారిశుద్ధ్యం, తాగునీటి పైప్ లైన్ రిపేర్లు, వన మహోత్సవ పనుల కోసం జేసీబీ లను కిరాయి పద్ధతిలో వినియోగించుకునేందుకు రూ. 5 లక్షలు కేటాయింపు వాటర్ సప్లై మోటార్ల రిపేర్లు, చైన్ బ్లాకుల కొనుగోలుకు రూ. 3 లక్షలు, 12వ వార్డులో బైరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద డ్రైనేజీ కల్వర్టు నిర్మాణానికి రూ. 50 వేలు, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణకు రోజువారీ కూలీల కోసం రూ. 4 లక్షలు, వీధి కుక్కల బెడద నివారణకు అనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ ) కార్యక్రమం కింద 300 కుక్కలకు హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ సంస్థ ద్వారా సర్జరీలు చేయించాలని తీర్మానం.
ఘన వ్యర్థాల నిర్వహణ(ఎస్.డబ్ల్యూ.ఎం రూల్స్ 2026) ప్రకారం తడి, పొడి చెత్త వేరు చేసి కంపోస్టింగ్ చేస్తున్న గోగ్రీన్ ఇన్నో్వేషన్స్ సంస్థకు రూ. 3,15,060 రూ..బిల్లు చెల్లింపుకు ఆమోదం. రంజాన్, బక్రీద్ పండుగ ఏర్పాట్లకు చేసిన రూ. 30 వేల ఖర్చుకు ఆమోదం. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, కౌన్సిలర్లు దొండపాటి అప్పిరెడ్డి, యారవ లక్ష్మి, కొనతం మంజుల, నన్నెపంగా శ్రీనివాస్, తాళ్ల లావణ్య,ఇంజమూరి శ్రీకాంత్, ఎండి అబ్దుల్ కలీం, బొలిశెట్టి లక్ష్మయ్య, గుగులోతు రవీందర్ నాయక్, వాసా జ్యోతి, ఇంజమూరి వెంకటమ్మ, ఎండి షాహిన్, ఆరూరి విజయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఖాజా ఖాన్, షేక్ మొగలాబి. మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.