తాతా మధు, నవీన్ రెడ్డికి ఊరట
08-09-2026 | 05:56pm
హైదరాబాద్: శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar)ను దూషించిన వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు(Tata Madhu), నవీన్ రెడ్డికి నాంపల్లి కోర్టు(Nampally Court)లో ఊరట లభించింది. స్పీకర్ ను కూలం పేరుతో పాటు, అసభ్య పదజాలంతో దూషించారని స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలపై సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదైంది. అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీల పోలీసు రిమండ్ ను తిరస్కరించిన కోర్టు రూ.10 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలు సమర్పించాక విడుదల చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.