పోలీస్‌ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు

13-10-2026 | 06:19pm

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి టౌన్, అక్టోబర్‌ 13 (విజయక్రాంతి): పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా అక్టోబర్‌ 21 నుంచి 31 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌(District SP Sirisetti Sankeerth) తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో ఓపెన్‌హౌస్‌లు, సిబ్బంది, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, షార్ట్‌ఫిల్మ్‌, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా రక్తదాన శిబిరాలు, మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్‌ 21న జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్లలో స్మృతి పరేడ్‌ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల రక్షణకు పోలీస్‌ శాఖ కట్టుబడి ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు