6 September, 2026 | 1:46 AM

బీసీలకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండం

06-09-2026 | 12:35am

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మున్నూరు కాపు సంఘం(Munnur Kapu Society) పటేల్స్ జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని, క్రమశిక్షణ చర్యల్లో అందరికీ సమాన న్యాయం చేయాలని కోరారు. వెనుకబడిన ఆసిఫాబాద్ జిల్లాకు ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదని, జిల్లాకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఎమ్మెల్సీ దండే విఠల్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లోని హామీలను అమలు చేయాలని కోరారు. బీసీలకు అన్యాయం జరిగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు