6 September, 2026 | 2:29 AM

విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయులు కీలకం

06-09-2026 | 12:50am

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని న్యాయ సేవాధికార సంస్థ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కె.సౌజన్య అన్నారు. న్యాయసేవాధికారసంస్థ జిల్లా చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ అదేశానుసారం  ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని  సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లి గ్రామంలోని తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ  స్కూల్లో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి సౌజన్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యాన్ని వివరించారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవడంలో ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలుస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని,  తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు