వక్తృత్వ పోటీలో బాన్సువాడ నర్సింగ్ విద్యార్థిని ప్రతిభ

31-10-2026 | 08:50pm

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో మూడో బహుమతి కైవసం

బాన్సువాడ,(విజయ క్రాంతి): వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 యూత్ పార్లమెంట్(Viksit Bharat Young Leaders Dialogue–2027 Youth Parliament) కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల(Banswada Government Nursing College) విద్యార్థిని ఏంజెల్ ప్రతిభ చాటుకుంది. కామారెడ్డిలోని ఆర్.కె. డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తృత్వ పోటీలో పాల్గొని తన ప్రసంగ పటిమతో ఆకట్టుకుని మూడో బహుమతిని సాధించింది. యువతలో నాయకత్వ లక్షణాలు, వక్తృత్వ నైపుణ్యాలు, సామాజిక అవగాహన పెంపొందించడంతో పాటు వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బాన్సువాడ తరఫున ఏంజెల్ పోటీలో ప్రతిభ కనబరిచి బహుమతి సాధించడం కళాశాలకు గర్వకారణంగా నిలిచింది.ఈ సందర్భంగా ఏంజెల్‌ను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. వక్తృత్వ పోటీలో మూడో స్థానం సాధించి బాన్సువాడకు గుర్తింపు తీసుకొచ్చిన ఏంజెల్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు