రైతు గర్జనకు బాన్సువాడ బీఆర్ఎస్ దండు

01-11-2026 | 12:28pm

బాన్సువాడ, నవంబర్ 1 (విజయ క్రాంతి): బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు గర్జన మహాసభకు బాన్సువాడ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఆదివారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నర్సింలు గౌడ్ ఆధ్వర్యంలో చలో ఆదిలాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహాసభకు బయలుదేరారు. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై (Agriculture Issues) నిర్వహిస్తున్న ఈ సభలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పయనమయ్యాయని నర్సింహులు గౌడ్ తెలిపారు.

రైతుల సమస్యలపై నిర్వహిస్తున్న ఈ మహాసభకు (Rythu Garjana Sabha) మద్దతుగా బాన్సువాడ నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లినట్లు పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు