కబడ్డీ జిల్లా ఆసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రాజు
21-09-2026 | 06:06pm
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్(Kabaddi District Association) ప్రధాన కార్యదర్శిగా తాడువాయి మండల కేంద్రానికి చెందిన సిహెచ్ రాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... జిల్లాలో కబడ్డీ(Kabaddi) క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికలలో అధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి, ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నగేష్, సహాయ కార్యదర్శిగా జగదీశ్వర్, ఉపాధ్యక్షులుగా మధుసూదన్ రెడ్డి,ఈసి మెంబర్లు గా లక్ష్మణ్, నాగరాజు, శ్రీనివాస్ లు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.