శనగ విత్తనాల మినీకిట్ల పంపిణీ

04-10-2026 | 05:34pm

తాడ్వాయి,అక్టోబర్,04( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి(District Agriculture Officer Mohan Reddy) ఆధ్వర్యంలో రైతులకు శనగ విత్తనాల మినీ కిట్లను(Peanut seed mini kits) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ... వచ్చే యాసంగి సీజన్ లో రైతులు(Farmers) శనగ పంటను విత్తుకొని లబ్ధి పొందాలని కోరారు. రైతులు వరి సాగు వైపుకు వెళ్లకుండా పప్పు ధాన్యాలు,నూనె గింజల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ వినయ్ కుమార్,తాడ్వాయి మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సింలు, ఏఈవోలు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు