పట్టభద్రులందరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలి

04-10-2026 | 05:57pm

యూత్ కాంగ్రెస్ ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి 

ఘట్ కేసర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : మహబూబ్ నగర్ - హైదరాబాద్ - రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు(Graduate MLC Elections) సమీపిస్తున్న తరుణంలో ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటును విధిగా నమోదు చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు బొక్క సంజీవ రెడ్డి(Bokka Sanjeeva Reddy) పిలుపునిచ్చారు. ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలో  ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటు అనేది సాధారణ ఓటు కాదని, అది విద్యావంతుల ఆత్మగౌరవానికి ప్రతీకగా మన సమస్యలను, ఉద్యోగాల సమస్యలను, విద్యా వ్యవస్థలో లోపాలను అసెంబ్లీలో గట్టిగా వినిపించే నాయకుడిని ఎన్నుకునే అవకాశం అన్నారు.

ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రాడ్యుయేట్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, ఉన్న నోటిఫికేషన్లలో అక్రమాలు జరిగాయన్నారు. కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తోందని, ప్రతి నిరుద్యోగ యువతకు అండగా నిలబడతుందని, కావున ప్రతి ఒక గ్రాడ్యుయేట్ తప్పకుండా తమ ఓటు ని రిజిస్ట్రేషన్ చేసుకొని మన అభ్యర్థి సమరాంమోహన్ రెడ్డి కి మద్దతుగా నిలువాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు