గోపాల్ పెట్ లో మహిళా సమైక్య భవన నిర్మాణ పనులను ప్రారంభం

27-09-2026 | 10:45pm

నాగిరెడ్డిపేట,సెప్టెంబర్ 27(విజయ క్రాంతి): నాగిరెడ్డిపేట మండలం(Nagireddypet Mandal) గోపాల్‌పేటలో మహిళా సమైక్య భవన(Womens Federation Building) నిర్మాణానికి సంబంధించిన స్లాబ్‌ పనులను సర్పంచ్‌ వంశీకృష్ణ గౌడ్‌(Sarpanch Vamsikrishna Goud) ఆదివారం ప్రారంభించారు.ఈ గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...గ్రామానికి మహిళా సమైక్య భవనం మంజూరు చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ భవనం మహిళా సంఘాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.మహిళల అభివృద్ధికి సాధికారతకు మహిళా సంఘ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో గోలిలింగాల మాజీ సర్పంచ్‌ బిట్ల మురళి,పాలకవర్గ సభ్యులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు