సైక్లింగ్ లో జాతీయస్థాయిలో రాణిస్తున్న మౌనిక
27-09-2026 | 10:28pm
తుంగతుర్తి (విజయ క్రాంతి) : సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాకు చెందిన గిరిజన బిడ్డ మౌనిక(Mounika), ఒక ప్రక్క చదువుతోపాటు, మరొక పక్క క్రీడలలో రాణిస్తూ, ఈనెల 27, 28 నిజామాబాదులో(Nizamabad) నిర్వహించిన సైక్లింగ్ పోటీలో(Cycling competition) రాష్ట్రస్థాయిలో ఆడుతూ, జాతీయ స్థాయిలో(National level) 2 స్థానాన్ని పొందింది. నిజామాబాద్ ఎంపీ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నది. ఈమె చిన్న తనం నుండి కబడ్డీ, ఖో ఖో, క్రీడలలోను రాణిస్తూ, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి ఎన్నో మెడల్ సాధించింది. సైక్లింగ్ లో కూడా రావడం పట్ల, కుటుంబ సభ్యులు, తోటి క్రీడాకారులు, గిరిజన తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.