ఆసుపత్రికి వాటర్ ఫ్రిడ్జ్ వితరణ
22-10-2026 | 09:43pm
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) పిట్లం మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆసుపత్రికి పిట్లం మండల కేంద్రంలోని చెందిన దుబాయ్ రాజు తన తండ్రి జ్ఞాపకార్థం వాటర్ ఫ్రిజ్‌ను(Water Fridge) బహుమతిగా అందించారు. గురువారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, స్థానిక సర్పంచ్ కుమ్మరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.