రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపిక...

02-10-2026 | 07:00pm

తాడ్వాయి,అక్టోబర్,02( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కమిటీ(Kabaddi Association Committee) ఆధ్వర్యంలో 14 మంది బాలికలు, 14 మంది బాలురు రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపికైనట్లు కామారెడ్డి జిల్లా కబడ్డి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజయ్య తెలిపారు. కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 16 లో బాలికలను,అండర్ 20 లో బాలురను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ నెల 2 నుంచి 5 వరకు రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు జరుగుతాయని ఆయన వివరించారు. క్రీడాకారుల దుస్తులకు, ప్రయాణం ఖర్చులకు ప్రతినిధులు రూ.5 వేలు విరాళంగా అందించారు.  రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, చైర్మన్ భాస్కర్, ఉపాధ్యక్షులు అంబీర్ శ్యామ్ రావు,కోశాధికారి శ్రీనివాసరెడ్డి,జాయింట్ సెక్రెటరీ జగదీశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు