గాంధీ ఆశయాలే మనకు మార్గదర్శకం

02-10-2026 | 10:27pm

ఏపీఎం అజయ్ నాయక్

గరిడేపల్లి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస,సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన మార్గమే మనకు మార్గదర్శకం కావాలని ఏపీఎం అజయ్ నాయక్(APM Ajay Naik) అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం గరిడేపల్లి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏపీఎం అజయ్ నాయక్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమ ని,గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్వావలంబన సాధిస్తూ కుటుంబ, సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. గాంధీజీ కలలుగన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీసీలు సైదులు, సుజాత, అధ్యక్షురాలు వీరకుమారి, కోశాధికారి రజియా, కార్యదర్శి గంగమ్మ, అకౌంటెంట్ దుర్గ, కవిత, 45 సంఘబంధం అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు