చట్టంపై బాలికలు అవగాహన కలిగి ఉండాలి..
02-10-2026 | 10:10pm
నిజాంసాగర్ అక్టోబర్ 02 (విజయక్రాంతి): బాలికలను చదువుతో పాటు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని బాన్సువాడ సబ్ డివిజన్ షీ టీం బృందం కానిస్టేబుళ్లు అనిల్ కుమార్, పార్వతి పేర్కొన్నారు. శుక్రవారం నాడు నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యార్థినుల(Kasturiba Gandhi students)కు షీ టీం, డయల్ 112 లపై అవగాహన కల్పించారు. ఎలాంటి సమస్యలు తలెత్తిన నిర్భయంగా షీ టీంకు, డైయల్ 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థినులకు వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరోజ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.