మాసంపల్లి గణపతి నవరాత్రి ఉత్సావాల అన్నదాన కార్యక్రమం

21-09-2026 | 06:10pm

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాల(Ganpati Navratri celebrations) సందర్భంగా మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద మహా అన్నదాన కార్యక్రమాలు(Maha Annadana programs) ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండలంలోని మాసంపల్లి గ్రామం(Masampally village)లో గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన ప్రారంభోత్సవం కార్యక్రమం చత్రపతి శివాజీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామంలో ప్రజలందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గణేష్ దీవెనలు మా ఊరి మాసంపల్లి పై ఎల్లప్పుడూ చల్లగా ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం విఘ్నేశ్వరునికి మహా ప్రసాద నివేదన జరిగింది.విశ్వశాంతి,లోక కళ్యాణం, కుటుంబ శ్రేయస్సు కోరుతూ గ్రామంలోని మహిళలు స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన వివిధ రకాలైన ప్రసాదాలు లడ్డూలు, ఉండ్రాళ్లు,మోదకాలు, గారెలు, పులిహోర, దద్దోజనం, కేసరి, సేమియా పాశం, చక్ర పొంగలి తదితర వివిధ రకాల పిండి వంటలు పండ్లు మరియు పాయాసాలను నిష్టతో తయారుచేసి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. వేద పండితులు స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహించి మహిళలు తెచ్చిన ప్రసాదాలతో స్వామివారికి నివేదన చేసిన అనంతరం భక్తులందరికీ పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దపట్ల సునంద కిషన్ రెడ్డి,చత్రపతి శివాజీ గణేష్ యూత్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు