అశ్వక్ ఉల్లా ఖాన్ జయంతి వేడుకలు

22-10-2026 | 07:15pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని అశ్వాఖ్ ఉల్లా ఖాన్ జంక్షన్ లో అశ్వాఖ్ ఉల్లా ఖాన్ జయంతి(Ashfaq Ulla Khan Birth Anniversary) వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వీట్లు పంచారు. కలాం గుణం ఎడ్యుకేషనల్ అనే యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖ వ్యవస్థాపకులు అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్, సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాస్తవ వీరులను నవ సమాజం మరిచిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

దేశ తొలి మలిదశ స్వతంత్ర ఉద్యమాలలో జరిగిన పోరులో అసువులు బాసిన మహన్నుల త్యాగాలలో సమాజానికి తెలపడం గుర్తించాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తొలిమలి దశ స్వాతంత్ర పోరాటాలలో పోరాడిన వాస్తవ వీరుల పేరిట స్మారక నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహమ్మద్ జకీ, మహమ్మద్ ఉస్మాన్, సయ్యద్ అఖ్తార్, మహమ్మద్ సుబూర్ షాహిద్, జమీర్, ఇమ్రాన్, మహమ్మద్ సాదత్ అలీ, మహమ్మద్ కరీం తదితరులు  ఉన్నారు.

మరిన్ని వార్తలు