పంట మద్దతు ధరపై రైతులకు అవగాహన

22-10-2026 | 07:22pm

కోహెడ,(విజయక్రాంతి): పత్తి, వరి, తదితర పంటల సాగు పై రైతులకు కనీస మద్దతు ధరలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన నిర్మల జయరాజు మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP), పత్తి విక్రయ విధానాలు, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ సదుపాయాల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

రైతులు తమ పత్తిని మద్దతు ధరకు విక్రయించుకునే విధానం, సంబంధిత నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం మార్కెట్ కమిటీ తరఫున అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రాధాన్యమన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి సుధాకర్, ఏఓ సతీశ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు