నాగిరెడ్డిపేట్ మండల సర్పంచులు అరెస్ట్
10-09-2026 | 08:44am
నాగిరెడ్డిపేట్ సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు బయలుదేరిన నాగిరెడ్డి(Nagireddypet ) మండలం గోపాల్పేట్, సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ (బిఆర్ఎస్), బెజ్గం చెరువు తండా గ్రామ సర్పంచ్ భాస్కర్ (బిజెపి), మాల్తుమ్మెద గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలులను నాగిరెడ్డిపేట మండల పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అరెస్టులు చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.