రైతు బీమా పథకం పునరుద్ధరణ

10-09-2026 | 08:43am

నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించినట్లు(Farmers Insurance Scheme) నాగిరెడ్డిపేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు రైతు బీమా కలిగిన రైతులు 2026 ఆగస్టు 14 తర్వాత మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని ఏవో సాయికిరణ్ సూచించారు. అర్హులైన కుటుంబాలకు రైతు బీమా ప్రయోజనం అందుతుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగిరెడ్డిపేట్ మండలం ఏవో సాయికిరణ్ తెలిపారు.

మరిన్ని వార్తలు