నీటిని వృధా చేయవద్దు

31-10-2026 | 11:02pm

తాడ్వాయి,(విజయక్రాంతి): తాగు నీటిని వృధా చేయవద్దని నీటిని పొదుపుగా వాడుకుందామని నందివాడ గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య(Nandiwada Sarpanch Sanku Pochayya) తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎలినినో ప్రభావం ఉన్నందున ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

గ్రామానికి మంజూరైన మహిళా సంఘ భవనానికి భూమి పూజ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉన్నందున కోతుల బెడద నుంచి గ్రామాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పొద్దుటూరి నవీన్ రెడ్డి, వీడిసి అధ్యక్షులు కంకణాల బాలచంద్రం, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బాల సాయిలు, కార్యదర్శి సవిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు