హోంగార్డ్ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం

23-09-2026 | 05:51pm

కుటుంబ సభ్యులకు అందజేసిన ఎస్పీ

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డ్ గోలి శ్రీనివాస్ కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున వెల్ఫేర్ ఎక్స్‌గ్రేషియా(Welfare Ex-gratia) కింద మంజూరైన రూ.20 వేల చెక్కును జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శ్రీనివాస్ మృతి పోలీస్ శాఖకు తీరని లోటని, ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సిబ్బంది సంక్షేమ పథకాలు ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు