పంటలలో చీడపీడలను నివారించుకోవాలి...

29-10-2026 | 07:36pm

తాడ్వాయి,అక్టోబర్,29( విజయ క్రాంతి ):యాసంగి లో వేసుకున్న పంటలలో చీడపీడలను నివారించుకోవాలని తాడువాయి వ్యవసాయాధికారి నరసింహులు(Agricultural Officer Narasimhulu) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామ శివారులో ఆయన గురువారం పప్పు దినుసుల పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో వేసుకున్న రాజ్మా,కంది,శనగ పంటలను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సందర్శించి రైతులకు సూచనలు సలహాలు అందించారు. చీడపీడల నివారణ సమగ్ర సస్యరక్షణ చర్యలపై  రైతులకు అవగాహన కల్పించారు. కంది పంటలో కాయతోలుచు పురుగు నివారణపై ప్రత్యేక సూచనలు అందించారు.

ప్రస్తుతం కంది పంట పూత దశలో ఉందని రైతులు పంటను ప్రతినిత్యం పరిశీలిస్తూ కాయ తొలిచే పురుగును గమనించి నివారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు