అయ్యప్ప భక్తులకు కొనసాగుతున్న అన్నదానం

29-10-2026 | 08:10pm

కోదాడ,(విజయక్రాంతి): అనంతగిరిలోని అయ్యప్ప సన్నిధిలో  ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 23,వ రోజు గురువారం  సుమారుగా 750  మంది స్వాములు అన్నప్రసాదం(Annaprasadam ) స్వీకరించినారు,  దాతలుగా మహారాజపోశకులు శ్రీ బుర్రా పుల్లారెడ్డి - సుధారాణి, వారి కుమారుడు బుర్రా ప్రమోద్ రెడ్డి దంపతులు, పసుమర్తి హరిప్రకాష్ - ప్రత్యుష దంపతులు వ్యవహారించినారు.

అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్నప్రసాదము అందించడం జరిగింది కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య, కొమెర వెంకన్న, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, దండు రమేష్, ఈదుల యాదగిరి, కొమెర వెంకన్న, కనకయ్య, జెర్రిపోతుల రాము,ఈదుల సత్యం మాలధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు