తహసీల్దార్ కు నాయి బ్రాహ్మణుల వినతి
కోహెడ, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ముదిరాజ్ కులాన్ని బీసీ (ఏ) లో కలపవద్దని కోరుతూ.. కోహెడ మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం(Nayi Brahmana Seva Sangham) ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ నవీన్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. 57 ఉప కులాలు ఉన్నాయని.. రాష్టంలో 37 లక్షల మంది జనాభా ఉన్నట్లు పేర్కొన్నారు.
సరైన ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు అందక దుర్భర జీవితం కొనసాగింస్తునట్లు చెప్పారు. ఆర్థికంగా ఉన్న బీసీ (డి) ముదిరాజ్ కులాన్ని రాజకీయ ఓటు కోసం మమ్మల్ని భలి చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కోహెడ మండల ప్రెసిడెంట్ సంగెం శ్రీనివాస్, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ సింగిరాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కుడుమేల్లి పెద్ద మల్లయ్య, సలహాదారు సింగిరాల కనకయ్య, శ్రావణ పెళ్లి శ్రీనివాస్, శ్రావణపల్లి కనకయ్య, శేఖర్, అశోక్, అరుణ్ పాల్గొన్నారు.