అనురాగ్ లో ముగిసిన ఏఐ ఐక్యం 2026

13-10-2026 | 10:44pm

ఘట్ కేసర్ (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University)లోని కృత్రిమ మేధస్సు విభాగం ఆధ్వర్యంలో ఐఈఈఈ సిఐఎస్ చాప్టర్ సహకారంతో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సాంకేతిక కార్యక్రమం ఏఐ ఐక్యం 2026 రెండవ రోజు కార్యక్రమాలు ఈ బ్లాక్ ఆడిటోరియంలో ఘనంగా ముగిశాయి. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏఐ మహాయుధ్, ఏఐ ప్రదర్శ, ఏఐ సంకల్ప్ అనే మూడు ప్రధాన కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టయోటా సీఈవో వివికె రంగాచార్యులు కొండమూరి, గౌరవ అతిథిగా టయోటా ప్రతినిధి కొండబాబు హాజరయ్యారు. వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక ఆలోచనలు, ఆచరణాత్మక సమస్యల పరిష్కారాల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను రూపొందించాలని సూచించారు. అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ కుమార్ అధ్యక్షోపన్యాసం చేశారు.

మరిన్ని వార్తలు