ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గుగులోత్ కుశ నాయక్

13-10-2026 | 10:55pm

పాల్వంచ (విజయక్రాంతి): లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కుశ నాయక్(Kusha Naik) నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నంగారా భేరి ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ, రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమితి వ్యవస్థాపకులు డా. ధారావత్ గణేష్ నాయక్‌ను జాతీయ అధ్యక్షుడిగా, రాజ్‌కుమార్ నాయక్‌ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అదేవిధంగా జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కమిటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన గుగులోత్ కుశ నాయక్‌ను నంగారభేరి లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.

జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ధారావత్ గణేష్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ నాయక్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గుగులోత్ కుశ నాయక్ మాట్లాడుతూ, లంబాడ జాతి హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు డా. ధారావత్ గణేష్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ నాయక్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు