అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం
లబ్ధిదారులు త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి: సర్పంచ్ బండి ప్రవీణ్
రామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తామని రామారెడ్డి గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్(Ramareddy Sarpanch Bandi Praveen) అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల(Indiramma Home Beneficiaries)తో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని విడతలవారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కోరారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థలాల్లో ముగ్గులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరేలా తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హనుమయోళ్ల నవీన్, పంచాయతీ కార్యదర్శి రాజు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.