నల్ల స్కార్పియోలో ఎంట్రీ.. గ్యాస్ కట్టర్‌తో చోరీ

11-10-2026 | 12:45pm

గాంధారి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు (Thieves) రెచ్చిపోయారు. కామారెడ్డి–బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం (SBI ATM)లో చొరబడి యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి నల్లరంగు స్కార్పియో (Black Scorpio) వాహనంలో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్‌ (Gas Cutter)తో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించారు. అయితే ఏటీఎంలో ఎంత మొత్తంలో నగదు ఉందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

చోరీ (ATM Theft) విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ నరసింహరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ రవీందర్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ మహేందర్ ఉన్నారు. చోరీకి సంబంధించిన వివరాలు, నిందితుల ఆచూకీపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

మరిన్ని వార్తలు