వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన

05-10-2026 | 05:58pm

బెజ్జూర్ అక్టోబర్ 5 (విజయక్రాంతి): బెజ్జూర్, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమం(Wildlife Awareness Program) నిర్వహించారు. ఈ సందర్భంగా బెజ్జూర్ రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్(Range Officer Shravan Kumar) ఆధ్వర్యంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన వన్యప్రాణి డాక్యుమెంటరీ వీడియోలను ప్రదర్శించారు.

పర్యావరణ సమతుల్యతలో పులుల పాత్ర, అడవి ఆవశ్యకత, వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతపై విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. అడవి ఉంటేనే మన మనుగడ ఉంటుందని, వన్యప్రాణులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ అధికారులు సూచించారు. వన్యప్రాణుల వేటను అరికట్టడంలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డాక్టర్ సునీత, పాఠశాల ఉపాధ్యాయులు, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు