సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలి
బెజ్జుర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): బెజ్జుర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 6 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్(MPDO Praveen Kumar) తెలిపారు. ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అందిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ బిమ్లా నాయక్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, మండల విద్యాధికారి డాక్టర్ సునీత, మండల పశువైద్యాధికారి లక్ష్మీనారాయణ, సీనియర్ అసిస్టెంట్ సోయల్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.