కాంగ్రెస్ ముక్త్ భారత్ బీజేపీ లక్ష్యం
- దేవుళ్లను విభజించడం సిగ్గుచేటు
- సీఎం హోదాలో బాధ్యతగా మాట్లాడాలి
- కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్, సెప్టెంబరు 30 (విజయక్రాంతి): సంఘ్ పరివార్ లేని భారత్‌ను ఊహించుకునే స్థితిలో ప్రపంచమే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) అన్నారు. కాంగ్రెస్ లేని భారత్‌ను చూడాలని దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, అందులో భాగంగా ఒకనాడు దేశ మంతా విస్తరించిన ఆ పార్టీని నేడు 3, 4 రాష్ట్రాలకే పరిమితం చేశారని చెప్పారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్ బీజేపీ లక్ష్యమని, సంఘ్ పరివార్ నీడ లేని సిలబస్‌ను రూపొందించాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేతలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలను ఆదేశించడం విడ్డూరమన్నారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మా ట్లాడారు. 840 కోట్ల రూపాయల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) నిధులతో చేపట్టిన అనేక పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందన్నారు.
ఈ నిధులతో నగరంలో చెత్త నిర్వహణ, పాత చెత్త డంప్‌యార్డుల శుద్ధీకరణ, నదీతీర అభివృద్ధి, పట్టణ రవాణా మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, పునరావాసం, వరదల ప్రభావాన్ని తగ్గించే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు. అట్లాగే స్మార్ట్ సిటీ మిషన్ కింద 5 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైబ్రరీని ప్రారంభించామని, 16 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డీఆర్ఎఫ్ బిల్డింగ్ ను, కశ్మీరగడ్డలో 6 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్‌ను ప్రారంభించుకున్నామన్నారు.
దీం తోపాటు వర్షపు నీటి డ్రెయిన్ల నిర్మాణం కోసం 21 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేశామని, కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు రూ.25 కోట్లతో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈనెల 4న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలంగాణకు వస్తున్నారని, కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశా లతోపాటు మెదక్ జిల్లాలో జరిగే కార్యక్రమంలో ఆయ న పాల్గొంటారని తెలిపారు. దేవుళ్లను విభజిస్తున్న సీఎంను చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యించుకుంటున్నారన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతాయు తంగా మాట్లాడాలని, రాము డు, శివుడి పేరుతో దైవాన్ని చీల్చాలనుకుం టే హిందూ సమాజం తిరగబడటం తథ్యమన్నారు. కాం గ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అని, తిట్టుకోవడం, విమర్శించుకుంటూ ఆరు గ్యారంటీ లను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూ టీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బో యినిపల్లి ప్రవీణ్ రావు పాల్గొన్నారు.