మంచినీటి బోరు బావి ప్రారంభించిన 12వ కౌన్సిలర్

31-10-2026 | 11:25pm

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి మున్సిపాలిటీ(Chopadandi Municipality) 12వ వార్డు గణేష్ నగర్ వీధి లో పొన్నం రాములు ఇంటి దగ్గర ప్రజల దాహార్తి తీర్చేందుకు మంచినీటి బోరు పనులు ప్రారంభం 12 వార్డులో  వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు వేయించడం జరిగింది. వార్డ్ కౌన్సిలర్ ముద్దం రాధ తిరుపతి గౌడ్(Ward Councilor Muddam Radha Tirupati Goud) ఆధ్వర్యంలో ఈ రోజు కొబ్బరికాయ కొట్టి బోరు పనులను ప్రారంభించారు.

వార్డులో గత కొంతకాలంగా మంచినీటి కొరత ఉండడంతో ఈ బోరు మున్సిపల్ 15 ఫైనాన్స్ నిధుల తో  వేయిస్తున్నట్లు తెలిపారు. ఈ బోరు ద్వారా వార్డు ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందని, త్వరలోనే మోటారు లేదా చేతి పంపు బిగించి నీటి సరఫరా చేస్తామని కౌన్సిలర్ ముద్దం రాధ తిరుపతి గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు