ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం రాజ్యాంగబద్ధమైన హక్కు

24-10-2026 | 09:33pm

న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: సివిల్ జడ్జి పి.బి. కిరణ్ కుమార్ 

హుజురాబాద్, అక్టోబర్ 24:(విజయక్రాంతి) : ఖైదీలకు(Prisoners) న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు, ఆర్థిక స్థోమత లేని వారికి ఉచిత న్యాయ సహాయం(Free Legal Aid) అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ(Legal Services Authority) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.బి. కిరణ్ కుమార్(P. B. Kiran Kumar) తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్ జైలులో(Huzurabad Sub-Jail) ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణ ఖైదీలకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ చట్టం కింద అందించే ఉచిత న్యాయవాది సేవలు, బెయిల్ పొందే విధానాలు, లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకునే మార్గాలను వివరించారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయ సహాయానికి దూరం కాకూడదని, ఖైదీలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం మండల న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఖైదీలు అడిగిన పలు న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సబ్ జైలు పర్యవేక్షణ అధికారి పి. శ్రీనివాస్, అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ టి. సురేష్, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు