రైతుల పంటలను కాపాడండి

11-10-2026 | 09:47pm

కొత్తపల్లి, అక్టోబర్ 11(విజయక్రాంతి): వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా(Power supply) చేయాలని, కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రూరల్ మండలంలోని రైతులు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ మండలం లోని గోపాల్‌పూర్ చౌరస్తా వద్ద రైతులు, స్థానిక ప్రజలు కలిసి ధర్నా, రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) హాజరై రైతులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. అనంతరం కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతోపాటు సాగునీటి సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని,విద్యుత్ కోతలను నియంత్రించి పంటలకు సకాలంలో నీరు అందేలా చూడాలని, వానాకాలం పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం చెల్లింపు చెయ్యాలని,యాసంగి పంట సాగు చేయలేని రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం అందించి,వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను పరిష్కరించాలని,పశుపోషక రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోని,,రైతులతో చర్చించి విద్యుత్, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వన్ని 

డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు